
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 శ్రీ సాయిబాబా దేవాలయం,హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జన,ప్రియ నగర్ లో గల శ్రీ సాయిబాబా దేవాలయం,మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం,గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీ సాయిబాబా ఆలయాలను సందర్శించి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ,కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మ ,అశోక్ రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీనివాస్,భరద్వాజ్,ఉరిటీ వెంకట్రావు, శ్రీనివాస్ నాయక్, ఓ.వెంకటేష్, ఎండి . ఇబ్రహీం, సందీప్ రెడ్డి,దీక్షిత్ రెడ్డి ,నరేందర్ బల్లా, యశ్వంత్,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.