
10.7kViews
79
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి బండి రమేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవశ్యకతను పాటలో రూపంలో పాడి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు బండి రమేష్ అన్నారు.సాయిచంద్ కు నివాళులు అర్పించిన వారిలో సంజయ్ కుమార్, మాజీద్ భాయ్, మల్లికార్జున శర్మ, జి సంగారెడ్డి, నర్సింగ్ రావు, శేఖర్ గౌడ్, తెప్ప బాలరాజు ముదిరాజ్, అంజద్ అమ్ము, షరీఫ్, మనీష్ కుమార్, సత్య రెడ్డి, వెంకటరమణ, రవీందర్ రావు, బిఆర్ యువసేన ఉన్నారు.