
తెలంగాణ మిర్రర్, మెదక్: ఇంటికో ఆవు,గ్రామ గ్రామానికి ఒక గోశాల ఉంటే అట్టి గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని రసాయన ఎరువులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని అవును మనం రక్షిస్తే అట్టి ఆవు మను రక్షిస్తుందని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త మహామంత్రి స్థాను మాలయాన్ , విశ్వహిందూ పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి బండారు రమేష్, సాందీపని వేదపాఠశాల నిర్వాహకులు సంగమేశ్వర్ లు అన్నారు. నేడు మెదక్ జిల్లా రామాయంపేటలోని సాందీపని వేద పాఠశాలను విశ్వహిందూ పరిషత్ నాయకులు సందర్శించారు. ఈ ప్రాంతంలోని రైతులకు ఆవులను ఉచితంగా ఇచ్చారు, నేటి వరకు 126 మంది రైతులకు ఆవులను ఇవ్వడం జరిగిందని తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం గోఆధారిత దేశం. రైతుల వద్ద గోవు ఉంటే అట్టి గోవు పై ఆధారపడి వాటి పేడ ఎరువు తో, మూత్రముతో ఎరువులు తయారు చేసుకొని రసాయన ఎరువులు వాడకుండా గోవు నుంచి లభించే పేడ మూత్రంతోసహజ ఎరువులు తయారు చేసుకొని భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ జీవించాలని ఉద్దేశంతో సాందీపని వేదపాఠశాల ఆధ్వర్యంలో ఈ ప్రాంత రైతులకు గోవులు దానంగా ఇస్తున్నామని ఇప్పటివరకు 126 ఆవులను రైతులకు అందజేశామని తద్వారా రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను పండించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఇట్టి వ్యవసాయం చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు అన్నారు. సాందీపని వేదపాఠశాల ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.