Home » సమిష్టి సహకారంతో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సమిష్టి సహకారంతో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Admin
1.0kViews

*గుమ్మడిదల మండలంలో రూ. కోటి 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : సమిష్టి సహకారంతో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్,నల్లవెల్లి,నాగిరెడ్డి గూడెం,అనంతారం,కానుకుంట,మొళ్ళ గూడెం,వీరారెడ్డి పల్లి,రాంరెడ్డి బావి గ్రామాల పరిధిలో రూ.1 కోటి 70 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు,అంతర్గత మురుగు నీటి కాలువల,గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ వెనుకంజ వేయకుండా కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్, నియోజకవర్గ అభివృద్ధి నిధి,సీఎస్ఆర్ తదితర నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

పద్ధతి మార్చుకోండి….
టోల్‌గేట్‌ నిర్వాహకులకు సూచించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మండల కేంద్రమైన గుమ్మడిదల పరిధిలో గల జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ వద్ద ఇటీవల తరచూ గొడవలు,వివాదాలు జరుగుతుండటంతో ఈ విషయాన్నిస్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.మంగళవారం గుమ్మడిదల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జిఎంఆర్ టోల్‌గేట్‌ నిర్వాహకులను పిలిపించి మాట్లాడారు.ఏదైనా సమస్య ఉంటే స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలే గాని గొడవలకు దిగడం సరైంది కాదని టోల్‌గేట్‌ యాజమాన్యానికి సూచించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.స్థానిక ప్రజలకు టోల్‌గేట్‌ రుసుము మినహాయింపు ఇవ్వడంపై ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఉన్నత అధికారులతో చర్చించామని తెలిపారు.

జర్నలిస్టు కుటుంబానికి పరామర్శ…
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు నర్సింగ్ రావు కుటుంబాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ పరామర్శించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.నర్సింగ్ రావు కుటుంబానికి తాను అండగా హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment