Home » సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం : చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
1.0kViews

*అభివృద్ధి పనులకు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేసిన చైర్మన్ పాండురంగారెడ్డి

తెలంగాణ మిర్రర్, పటాన్‌చెరు : సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు.మున్సిపల్ పరిధిలోని శ్రీరామనగర్ కాలనీలో వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వసంక్షేమ పథకాలలో అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమంలోస్థానిక కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు కాలనీ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment