Home » సమాజ హితం సమాజ సేవలలో ఖార్డ్ సంస్థ : అరెకపూడి గాంధీ

సమాజ హితం సమాజ సేవలలో ఖార్డ్ సంస్థ : అరెకపూడి గాంధీ

by Admin
430Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పి.జె.ఆర్ నగర్ లోని ఖార్డ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్, పేద మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, నిత్యావసర సరుకులను కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ శ్రీ రంగరావు తో కలిసి అందచేసిన  ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఖార్డ్ సంస్థ వారు పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని, ఖార్డ్ సంస్థ వ్యవస్థాపకులు సుమన్ మల్లాది, మంజులత మల్లాది లను ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు చేయూతనందించాలని ప్రభుత్వ విప్ గాంధీ  పేర్కొన్నారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం చాలా అభినందించ దగ్గ విషయం అని, ప్రతి ఒక్కరు ఖార్డ్ సంస్థ వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకోవాలని, వీరు ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలిచారని, సమాజం పట్ల సేవ చేయాలనే తపన సేవ చేయడానికి ఖార్డ్ సంస్థ వారిని ఎల్లవేళలా ముందు ఉంటారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షలు జిల్లా గణేష్ , తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, భాస్కర్, యాదగిరి, అగ్రవాసు, గుడ్ల శ్రీనివాస్, సిద్దయ్య, నరసింహులు, కటికరవి, దేవేందర్, అదమ్, మారుతి, మధులత, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment