
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : స్వామి వివేకానందుడంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని శేరిలింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ అన్నారు. వివేకానందుని 160వ జయంతి సందర్భంగా బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి, చందానగర్, మైత్రీ నగర్ జంక్షన్‌లో నిర్వహించిన జయంతి వేడుకలలో రాష్ట్ర బిజెపి నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి లతో కలిసి గజ్జల యోగానంద్ వివేకానందునికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ అమెరికాలో సర్వమత సమ్మేళనానికి ముందు వివేకానందులు అక్కడ అనేక రోజులు తిండి, నిద్ర లేకుండా రైలు పెట్టెలో గడిపి అనేక కష్టాలు పడ్డారని, అయితే, సర్వమత సమ్మేళనం తర్వాత వారి గొప్పదనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని నాటి విశేషాలను తెలియజేశారు. వివేకానందుల బోధనలన్నీ ప్రాక్టికల్‌గా నేటికి కూడా ఆచరిస్తున్నారని అన్నారు. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి స్వామి వివేకానందుల చరిత్రను చదువుకోవాలని పిలుపునిచ్చారు. గమ్యం చేరుకునే వరకూ నిద్రపోవద్దని… విజయంతో విర్రవీగవద్దని – అపజయానికి కుంగిపోవద్దని వివేకానందులు చెప్పిన సూక్తులను యోగానంద్ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో , అసెంబ్లీ, రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.