Home » సంస్కృతి పాఠశాలలో ముందస్తు సంక్రాతి సంబురాలు

సంస్కృతి పాఠశాలలో ముందస్తు సంక్రాతి సంబురాలు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : గ్రామీణ ప్రాంతాలను తలపించేలా సంస్కృతి  పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం సంతోషకరమని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలోని  సంస్కృతి  పాఠశాలలో విద్యార్థులు పాఠశాలలో ముందుస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి  కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దు, రైతు, పల్లెపడుచు వేషధారణలతో అలరించారు. అనంతరం కార్పొరేటర్ ఉప్పలపాటి మంటలాడుతూ మాట్లాడుతూ మన పండుగుల్లో సంక్రాంతి పండుగ మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని, ఈ పండుగకు పల్లెల్లో ధాన్యరాసులతో వర్ధిల్లుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సురేష్ బాబు ,ప్రధానోపాధ్యాయూరాలు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment