
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్ర అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యంమని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు.మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ , వేముకుంట కాలనీలకు చెందిన కాంగ్రెస్,బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికీ గాంధీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, అందరి మద్దతుతో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని అన్నారు.పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్ పార్టీ లో ముఖ్య నాయకులు విజయ్ కుమార్, జగదీష్ ముదిరాజు, సాయి కృష్ణ ,ప్రసాద్ ,దుర్గ ,ప్రణీత్, సంజీవ్ ,మహేష్, లక్షన్, భాషా, శివ కుమార్, రాణేశ్వర్, వర ప్రసాద్, వంశీ ప్రసాద్, ముజాహిద్, ప్రేమ్ కుమార్ ,శ్రీను, సుధీర్ ,రమేష్, యాది లాల్, బల్లు, రవి, కిరణ్ ,ప్రేమ్ ,చింటూ ,నర్సింహ ,వీరన్న, సుదర్శన్,ప్రశాంత్, తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి ,చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉరిటీ వెంకట్ రావు, ప్రవీణ్, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్,గురు చరణ్ దుబే, అక్బర్ ఖాన్ చింత కింది రవీందర్ ,శ్రీకాంత్ రెడ్డి, గిరి, అంజద్ పాషా, యూసఫ్, సందీప్, అవినాష్, పద్మారావు తదితరులు ఉన్నారు.