Home » సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

by Admin
9.7kViews
84 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితోచేస్తుందని విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో రూ. 13 కోట్ల 74 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత గౌడ్, మంజుల రఘునాధ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని  నీలిమ గ్రీన్స్, ప్రగతి ఎన్క్లేవ్ , డీకే ఎన్క్లేవ్ , జయప్రకాష్ నగర్,డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ, శ్రీజ బృందావనం, బైక్   ఎన్క్లేవ్ , మయూరి నగర్ కాలనీలలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.చందానగర్ డివిజన్ పరిధిలోని  శంకర్ నగర్, భవాని పురం,శంకర్ నగర్ ఫేస్ 2, సురక్ష ఎనక్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ, సత్య  ఎన్క్లేవ్,జవహర్ కాలనీ,సురక్ష ఎనక్లేవ్, శ్రీ కృష్ణ దేవరాయ,విశ్వేశరయ్య కాలనీ, సిటిజన్ కాలనీ,పూర్ణిమ టవర్స్, అహ్మద్ నగర్,శివాజీ నగర్, దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్,అన్నపూర్ణ ఎనక్లేవ్, వేముకుంటా ,గౌతమి నగర్ కాలనీలలో ,హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ  ,హుడా కాలనీ, శాంతి నగర్, రామకృష్ణ నగర్,మదీనగూడా, మైత్రీ నగర్ ఫేస్ 3, భాను టౌన్ షిప్, సాయి నగర్,యూత్ కాలనీ కాలనీలలో అభివృద్ధి పనులకు సంఖుస్తపనలు చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ  మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్  పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment