950Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు పయనమవుతున్న వారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు జారీ చేశారు. ఇలాంటి సమయాల్లో దొంగతనాలకు ఆస్కారం ఉందన్న సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వారికి పలు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలు…
1. కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి
2. కాలనీలు, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
3. బైక్‌లు, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి
4. విలువైన వస్తువులను బైక్‌లు, కార్లలో పెట్టొద్దు
5. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి
6. పేపరు, పాలవారిని రావద్దని చెప్పాలి
7. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి
8. ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరే పెట్టుకోవాలి
9. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి
10. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి
11. పోలీస్‌స్టేషన్, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర పెట్టుకోవాలి
12. ప్రజలు, పోలీసుల సమన్వయంతో చోరీల నియంత్రణ సులభం
13. నమ్మకమైన సెక్యూరిటీ, వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి
14. బంగారు నగలు, నగదు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. – కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 94906 17444 కు సమాచారం ఇవ్వాలని అన్నారు.