
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : దివంగత నేత మాజీమంత్రి పట్లోళ్ల ఇంద్రరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇంద్రా రెడ్డి మెమోరియల్ కబడ్డీ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, తాసిల్దార్ సైదులు ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపాల్, మునిసిపాలిటీ అధ్యక్షులు విష్ణు పంతులు, ప్రవీణ్ కుమార్, సర్పంచ్ సంఘల అధ్యక్షుడు నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికై మండలానికి పేరు తేవాలన్నారు. అలాగే క్రీడాలు స్నేహాసంబంధాన్ని పెంచుతాయాని ఆయన సూచించారు. కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ లను అభినందించారు. అదేవిదంగా సంకేపల్లి గ్రామ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ మాట్లాడుతూ…మా గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఇంద్రా రెడ్డి మెమోరియల్ కబడ్డీ పోటీలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో వివిధ మండలాల నుంచి 32 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి గ్రామం ఎంపీటీసీ మేఘన సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, వార్డ్ మెంబర్స్, ఈ కార్యక్రమం ముఖ్య సభ్యులు, ఉప్పరి వెంకట్ రాములు, నరసింహులు, బిక్షపతి, ఉప్పరి చంద్రయ్య, గణేష్, యు సురేష్ కే మల్లేష్, బి సత్తయ్య, నరసింహులు, శ్రీనివాస్ కె వెంకటేష్, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ భద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ రఘు, వెంకటేష్, సాయిలు, అంజి, వివిధ పార్టీల నాయకులు టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు గ్రామంలో ఉన్న వివిధ సంఘాల నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.