
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మిస్తున్న రెండు 6 లేన్ల ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్, ఫిలింనగర్ జంక్షన్, ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.ఈ మేరకు ప్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గాంధీ బుధవారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేర కడుతున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, 74 పిల్లర్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారని తెలిపారు. విశ్వనగరంగా వడివడిగా అడుగులేస్తున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని, ముఖ్యంగా ప్రధాన రహదారులపై రద్దీని తగ్గించేందుకు నిర్మిస్తున్న అనుసంధాన రోడ్లు ట్రాఫిక్ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాయని, వీటి వల్ల సమయం ఆదా అవ్వడమే కాదు.. దూరం దగ్గరై.. గమ్యస్థానానికి ప్రయాణం సాఫీగా సాగిపోవచ్చని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ రంగం, అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దూర దృష్టితో,మంత్రి కేటీఆర్ ప్రణాళికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎస్ ఆర్ డి పి ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగె విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యం తో ఎస్ ఆర్ డి పి ప్రాజెక్ట్ లో భాగంగా తొలి ఫలితం అయిన అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దారుగుపల్లి నరేష్, సంపత్, కాశినాథ్ యాదవ్, సల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.