Home » శ్వాస పరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు అవగాహనా సదస్సు

శ్వాస పరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు అవగాహనా సదస్సు

by Admin
530Views

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : అమీర్ పేట ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ మత్తు మందు ప్రభావంలో ఉండే ఒక రోగి యొక్క శ్వాస నాళాన్ని నియంత్రించే విషయంపై ఆదివారం ప్రత్యేమైన వర్క్ షాపు ను నిర్వహించారు. ఆసుపత్రి యొక్క అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాపులో మత్తు మందు ప్రభావంలో ఉన్న రోగుల యొక్క శ్వాస నాళంలో తలెత్తే ఇబ్బందులు, రోగులకు ఎలాంటి శ్వాస పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి అందుబాటులో ఉన్న పలు పద్దతులను నిపుణులైన వైద్యులు వివరించారు. మత్తు మందు అందించే క్రమంలో రోగులలో ఏర్పడే పలు సంక్లిష్టమైన పరిస్థితులు తద్వారా తలెత్తే శ్వాస పరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వైద్యులు ప్రత్యేకమైన ప్రదర్శనలు ఇచ్చారు. అనస్థీషియాలజీ , ఇంటెన్సివ్ కేర్ విభాగం వైద్యులు డా. కళ్యాణ్, డా. సి ఎన్.చంద్రశేఖర్,డా. సి ఉమాశ్రీదేవి నిర్వహించారు. వీరితో పాటూ ప్రొఫెసర్ సురేందర్, ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ,ప్రొఫెసర్ పద్మజ లు సంబంధిత అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చారు. వీరితో పాటూ డా. కళ్యాణి, డా. ఇందిర, డా. విభావరి, డా. శ్రీనివాస్, డా, బసంత్ తదితరులు వర్క్ షాపు లో పలు అంశాలపై పాల్గొన్న వారికి ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.సి.ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శస్త్ర చికిత్స జరుగుతున్న సందర్భాలలో మత్తు ప్రభావంతో ఉన్న రోగుల యొక్క శ్వాస నాళాలను పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ప్రస్థుతం ఎన్నో ఆదునిక పరికరాలు,సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనికి వచ్చాయని వివరించారు. ఆపరేషన్ థియేటర్స్ లో శ్వాస నాళాలను నిర్వహించడం నానాటికీ సంక్లిష్టంగా మారుతోందని అన్నారు. ముఖ్యంగా రోగికి శ్వాసనాళాల నిర్వహణ అనేది ఒకేలా ఉండదు కాబట్టి వైద్యులు . వైద్య విద్యార్థులకు కృత్రిమ శ్వాస అందించే సందర్భాలు అంటే థియేటర్ లో శస్త్ర చికిత్స చేయించుకొంటున్న రోగి లేదా కృత్రిమ శ్వాస అంటే వెంటిలేటర్ పై ఉంచబడే పేషెంట్లలకు సంబంధించిన అంశాలలో ఉండే సంక్లిష్టత ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని వివరించారు.ఒక రోజు పాటూ నిర్వహించిన ఈ వర్క్ షాపునకు నగరంలోని పలు ఆసుపత్రులు, వైద్య కళాశాలల నుండి 40 మందికి పైగా వైద్యులు హాజరై శిక్షణ తీసుకొన్నారు. వీరికి నిపుణులైన సీనియర్ వైద్యులు పలు అంశాలపై ఉపన్యాసాల ద్వారా వివరించడమే కాకుండా వారికోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి విషయానికి సంబంధించిన పలు పరికరములు, సాంకేతిక పరిజ్ఞాన యొక్క వినియోగం పై అవగాహన కలిపించడం విశేషం.

You may also like

Leave a Comment