Home » శ్రీ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ రెస్టారెంట్ ప్రారంభం

శ్రీ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ రెస్టారెంట్ ప్రారంభం

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, (గచ్చిబౌలి):  శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ రెస్టారెంట్ ను గురువారం  గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్,  శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ లు కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ శ్రీ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషకరం అని కస్టమర్లకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్  , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, శ్రీ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ రెస్టారెంట్ యాజమాన్యం లలిత శ్రీనివాస్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి , గిరి ,నర్సింగ్ నాయక్, హరీష్ శంకర్ యాదవ్, ప్రకాష్, మన్నే రమేష్, రంగస్వామి, శ్రీకాంత్, చిన్న,క్రాంతి, రాజు, శ్రీను, ప్రసాద్, నర్సింగ్ రావు, నరేష్ స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment