Home » శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హరిహరుల వైభవోత్సవాలకు అంకురార్పణం

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హరిహరుల వైభవోత్సవాలకు అంకురార్పణం

by Admin
400Views

వైభవోత్సవంలో పాల్గొన్న భక్తులు

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హరిహరుల వైభవోత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అంకురార్పణ చేశారు. ఆలయ రజతోత్సవాల్లో పాల్గొనేందుకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామితో కలిసి హైదరాబాద్ వచ్చిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదాపీఠానికి తెలంగాణ రాష్ట్రంపై ఎంతో మక్కువ ఉందన్నారు ఆ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో చందా నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రజతోత్సవాలను పురస్కరించుకుని హరిహరుల వైభవోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలలో చండీహోమం, రుద్రహోమం చేపడట్టామని, శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చన ఉంటుందని వివరించారు. కొంతకాలంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఉత్తరాదిలోనే ఎక్కువ కాలం గడిపారని, సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వివరించారు.

You may also like

Leave a Comment