
530Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: చందానగర్ విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో రజతోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు రజతోత్సవాలు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి,ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సాత్మనందేంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉత్సవాలకు ఆలయాన్ని రంగులతో అలంకరించారు. ఆవరణ ను శుభ్రం చేశారు. భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల సౌకర్యాలతో పాటు ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు అధికారులు, ఆలయ సిబ్బంది, పండితులు, కమిటీ సభ్యులు, ఏర్పాట్లు చేస్తున్నారు.