
940Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విశాఖ శ్రీ శారద పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి సందర్భంగా శుక్రవారం గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.విశ్వక్సేన పూజ,జిలకర బెల్లం,నూతన వస్త్రాల సమర్పణ వేడుకలు నిర్వహించారు.గోదా రంగనాథ కల్యాణ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు సత్యసాయి తెలియజేశారు.విశ్వక్సేన పూజ,జిలకర బెల్లం,నూతన వస్త్రాల సమర్పణ,మాంగల్య ధారణ,తలంబ్రాల వేడుకలు వైభవంగా జరిపారు.ఈ కళ్యణమహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.