
*శ్రీ వారికీ పూర్ణాభిషేకం,శ్రీ వరాహస్వామి వారికీ జలాధివాసం విశాఖ శారదాపీఠం పాలిత చందానగర్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో రజతోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నాల్గవ శనివారం విశాఖ శార దా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి వార్ల పర్యవేక్షణలో పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 6 గంటల నుంచి గణపతి విశ్వక్సేన ఆరాధనలు పుణ్యహవచనము, సూర్య, గణపతి, విష్ణు రుద్ర, అంబిక, నవగ్ర హ, నారసింహ, రామ, కృష్ణ వేంకటేశ, చండి మంత్రానుష్టానములు, సుందరకాండ పారాయణం, హనుమత్ హోమ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్వామి వారికి పూర్ణాభిషేకం , శ్రీ వరాహస్వామి వారికీ జలాధివాసం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సత్యసాయి ఆచార్యులు స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారికి హారతి అందించి తీర్థ ప్రసాదములను అందజేశారు.ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
*విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్న టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,బిజెపి పార్టీ డా.లక్ష్మణ్
విశాఖ శారదాపీఠం పాలిత చందానగర్ సముదాయం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు.ఈ సందర్బంగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ లు శనివారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
*టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని కలిసిన శ్రీ శారద పీఠం సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు..
చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న హరిహరుల వైభవోత్సవ లో భాగంగా శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వై.వి సుబ్బా రెడ్డిని శ్రీ శారద పీఠం శాశ్వత సభ్యులు మిర్యాల రాఘవరావు, దేవేందర్ రెడ్డి, అశోక్ గౌడ్, ఉరిటి వెంకట్రావు, శ్రీకాంత్, అశోక్ కుమార్, నరేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.