Home » శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ అసమానతం : జె.కృష్ణయ్య

శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ అసమానతం : జె.కృష్ణయ్య

by Admin
970Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నల్లగండ్లలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి లింగంపల్లి జిల్లా ప్రజా పరిషద్ పాఠశాల హెడ్ మాస్టర్ జె.కృష్ణయ్య హాజరయ్యారు.ఈ ప్రదర్శనలో విద్యార్థులు సుమారు 200 ప్రాజెక్టులను తయారు చేశారు.త్రిగుణమెట్రీ,పాస్కల్ గేమ్స్,హిందూ సంప్రదాయాల్లో నిర్వహించిన సైన్స్,జానపద కళలు,గ్రామర్ ట్రీ,కట్ పుత్లియా,బాతునికాచువా తదితర ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.అనంతరం జె.కృష్ణయ్య మాట్లాడుతూ గణితశాస్రం నిత్య జీవితంలో ఎంతో అవసరమని అన్నారు.అనంతరం విశిష్ట అతిధి పత్తి నర్సింహా మాట్లాడూతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యతో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం సంతోషమని విద్యార్థులను,ఉపాధ్యాయులను కొనియాడారు.పాఠశాల ప్రిన్సిపాల్ వాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానానికి సంబదించిన కార్యక్రమాలు చేపట్టాలని దీంతో జ్ఞానం పెంపొందడంలో సహాయపడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

You may also like

Leave a Comment