Home » శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఘనంగా ‘గ్రాడ్యుయేషన్‌ డే’ వేడుకలు

శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఘనంగా ‘గ్రాడ్యుయేషన్‌ డే’ వేడుకలు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్  శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో యు.కె.జి చిన్నారులకు ప్రిన్సిపాల్ భావన ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్‌ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనిధి స్కూల్ గ్రూప్ చైర్మన్ నల్లపాటి రాజేశ్వరి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వెల్కమ్ డాన్స్ లతో నిజమైన గ్రాడ్యుయేషన్ ని తలపించేలా పాఠశాలలో  డెకరేషన్ చేసి ఆకట్టుకున్నారు. గ్రాడ్యుయేషన్ డ్రెస్సులతో చిన్నారులను చూడముచ్చటగా కనిపించారు.అనంతరం నల్లపాటి రాజేశ్వరి మాట్లాడుతూ..చిన్నారుల్లో ఆనందం నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. పిల్లలు సంతోషంగా ఉంటే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని,  ఇలాంటి కార్యక్రమాల తో విద్యార్థినీ విద్యార్థులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ప్రిన్సిపాల్ భావన  ఇలాంటి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తున్నానని ఆమె అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్ వేషధారణలో వారి పిల్లలను చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు చైర్మెన్. ప్రిన్సిపాల్ అధ్యాపకులు చిన్నారులతో కలిసిపోయి గ్రాడ్యుయేషన్ టోపీలు సర్టిఫికెట్స్ ధరించి పిల్లలతో కలిసి పోయారు.చిన్నారుల డ్యాన్స్ ఆటపాటలతో గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు. విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment