
శ్రావణ మాసం ఇది ఎంతో పవిత్రమైన నెలగా హిందువులు భావిస్తారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 5వ మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం ఆగస్టు 9న ప్రారంభమై, సెప్టెంబర్ 7న ముగుస్తుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుతారు. ఈ వ్రతాన్ని తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో మహిళలు అధికంగా మహిళలు ఆచరిస్తారు. భక్తితో పూజించిన వారికి కొంగుబంగారమై వరాలిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతి దేవికి చెప్పినట్లు స్కాంద పురాణంలో ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. అక్కడ బంగారు ప్రాకాలు, తలుపులతో రమణీయంగా ఉండేదట. పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె అత్యంత భక్తి గౌరవాలు కలిగిన పుణ్యస్త్రీ, ప్రతిరోజు ప్రాతఃకాలన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి, గృహాకృత్యాను పూర్తిచేసి అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మి అమ్మ వారు రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను శ్రద్ధభక్తితో పూజించు, నీవు కోరిన కోరికలను తీరుస్తానని అంతర్థనమైంది. అంతలో మేలుకొన్న చారుమతి ఇదంతా ఒక కలగా భావించిన ఆమె భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోశించి, వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించాలి నిర్ణహించుకున్నారు. శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలో ని స్త్రీలను ఆహ్వానించి, గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసి మండపం పై బియ్యం పంచపల్లవాలైన రవి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకుతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవిని…
“సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధితే
శరణ్యే త్రయంబుకే దేవి నారాయణే నమోస్తుతే” అని ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మ వారికి షోడశోపచారాలతో పూజించి భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పొగుల తోరనాన్ని చేతికి కట్టుకొని శ్రధ్ధ భక్తితో నమస్కారించుకున్నారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లల్లో కూడా ధన, కనక వస్తువులతో నిండిపోయింది. పట్టణంలోని వారంతా చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్బగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యలతో సిరిసంపాదలతో సుఖజజీవనం గడిపి ముక్తిని పొందారు.ఈ కథ విన్న, వ్రతం చేసిన లేద చూసిన కూడా సకల సౌభాగ్యలు, సిరిసంపదలు, ఆయురారోగ్యశ్వర్యాలు సింద్ధిస్తాయని సూత ముని శౌనకాది మహర్షుల కు చెప్పారు.