
తెలంగాణ మిర్రర్,మియాపూర్ : గురు పౌర్ణమి పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాలలో ఉన్న సాయిబాబా దేవాలయాల్లో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనప్రియ అపార్ట్మెంట్ సాయి బాబా దేవాలయం,హుడా కాలనీలోని సాయి బాబా మందిరము , మియాపూర్ లోని సాయి బాబా ఆలయంలో బాబా దర్శనం చేసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడోసారి ముఖ్యమంత్రిగా యాట్రిక్ సాధించాలని సాయిబాబాను ప్రార్థించానని బండి రమేష్ అన్నారు.ఈ సందర్భంగా అర్చకులు ఆయన చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, నర్సింగ్ రావు, తెప్ప బాలరాజు ముదిరాజ్ ,శేఖర్ గౌడ్ , కాకర్ల అరుణ, సత్యారెడ్డి , అంజద్ అమ్ము, రవణ, సత్తయ్య , ఉమేష్ , బిఆర్ యువసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.