Home » శేరిలింగంపల్లి లో ఘనంగా ” ఆధ్యాత్మిక దినోత్సవం”

శేరిలింగంపల్లి లో ఘనంగా ” ఆధ్యాత్మిక దినోత్సవం”

by Admin
10.1kViews
130 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని అమ్మ వారి దేవాలయం లో జరిగిన ” తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. కేసీఆర్  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో ,దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. అదేవిధంగా సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి తెలిపారు. . ప్రజల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్నది అని, అదేవిధంగా స్వరాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న ఆలయాలు,సమైక్య రాష్ట్రంలో సరైన పట్టింపు లేక మరుగున పడిన ఆలయాలు స్వరాష్ట్రంలో కేసీఆర్ సంకల్పంతో నేడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అడుగడుగునా భక్తి భావం ఉట్టిపడేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది.

తెలంగాణలో కొలువై ఉన్న ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ చేపట్టి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అని, యాదాద్రి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న బాసర, కొండగట్టు, వేములవాడ, కొలనుపాక తదితర ఆలయాల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ మలికార్జున శర్మ ,బీఆర్ఎస్ పార్టీనాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారీ,గోపి కృష్ణ, కవిత, నరేందర్ బల్లా,సందీప్ మరియు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment


శేరిలింగంపల్లి లో ఘనంగా “తెలంగాణ విద్యా దినోత్సవం”

by Admin
11.3kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం  తెలంగాణ విద్యా దినోత్సవాని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ లో గల ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 23.05 అంచనావ్యయం తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీ లో గల ప్రభుత్వ పాఠశాల లో మౌళికవసతుల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులను ప్రారంభించుకొవడం చాలా సంతోషకరమైన విషయం అని, తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులను సూచించారు. అదేవిధంగా మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయడం జరిగిన విషయం విదితమే నని, దశల వారిగా అన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి అని నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి.

చూడముచ్చటైన తరగతి గదులు…. క్లాస్‌రూంలో డ్యూయల్‌ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్‌ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సకల సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి. నేడు ప్రభుత్వ పాఠశాలు అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల వసతుల తో ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని గాంధీ పేర్కొన్నారు .

ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించడమే ధ్యేయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అదేవిధంగా మన ఊరు మన బడి మొదటి విడతలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి శేరిలింగంపల్లి మండలం పరిధిలో 24 కూకట్పల్లి మండలం పరిధిలో 7 మొత్తము 31 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించమన్నారు. మిగతా పాఠశాలలను దశల వారిగా పూర్తి చేసి శేరిలింగంపల్లి ని ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TSEWIDC AE శ్యామ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీనాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.