
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.ఆదివారం మియాపూర్ గ్రాండ్ సితార హోటల్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. కొందరు తనపై దృష్ప్రచారం చేస్తున్నారని పైరవీలు చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నానని అంటున్నారని కాగా తానూ ఎవ్వరికీ ఏనాడూ లంచం ఇచ్చి పని చేయించుకోలేదని, అదేవిదంగా టికెట్ కొనుక్కోలేదని,తనపై నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు తనను పిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని,శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేయాలనీ కోరారని తెలిపారు. కార్యకర్తలు పని చేయాలని,గెలుపే లక్ష్యంగా కృషి చేయాలనీ బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అడగాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ శేరిలింగంపల్లి కార్డినెటర్ వినయ్ రెడ్డి,రఘునందన్ రెడ్డి,మహిపల్ యాదవ్,హమీద్ మియా,డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్,మహిళ కాంగ్రెస్,మైనారిటీ కాంగ్రెస్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.