Home » శేరిలింగంపల్లి మండలంలో కొత్త మద్యం పాలసీ.. మార్గదర్శకాలు జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ

శేరిలింగంపల్లి మండలంలో కొత్త మద్యం పాలసీ.. మార్గదర్శకాలు జారీ చేసిన ఎక్సైజ్‌ శాఖ

by Admin
12.8kViews
85 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ శాఖ సిఐ గాంధీ నాయక్ మార్గదర్శకాలను తెలిపారు. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం పరిధిలో 7 వార్డులుగా విభజించారు. కొత్త మద్యం పాలసీ 2023 ఆగష్టు 4వ తేదీ నుండి అమల్లోకి రానుందని,ఈ పాలసీ 2023 ఆగష్టు 18వ తేదీతో ముగియనుందని తెలిపారు. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా (నాన్‌ రిఫండబుల్‌), స్పెషల్‌ రీటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్‌ రూపంలో కానీ చెల్లించవచ్చు. కాళీ మందిర్ లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు.. దరఖాస్తుదారులు డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ అండ్ ఎక్స్ సైజ్ ఆఫీసర్ శంషాబాద్ పేరు మీద లేదా చలాన్ తీయాలని తెలిపారు.ఈ టెండర్ ను శంషాబాద్ లోని మల్లికా గార్డెన్ లో డ్రా ప్రక్రియ జరగనున్నట్లు ఆయన తెలిపారు.21 వ తేదీన లాటరీ పద్దతి ద్వారా దుకాణాలను కేటాయిస్తారని అన్నారు.ఐయితే ఈ సారి మద్యం దుకాణాల్లో గౌడ్స్ కి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది సర్కార్.కాగా శేరిలింగంపల్లి మండలంలో ఎస్ సి లకు 3 కేటాయించగా గౌడ్ లకు 35 వైన్ షాప్ లను నూతనంగా కేటాయించారు.

You may also like

Leave a Comment