Home » శేరిలింగంపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి : విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి : విప్ ఆరెకపూడి గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి  : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్‌,  శాసన సభ్యులు  అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శనివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ కాలనీ,డాక్టర్ కాలనీ ,డైమండ్ ఓక్ అపార్ట్మెంట్ లలో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి  విజ్ఞప్తి మేరకు  పాదయాత్ర చేపట్టామని అన్నారు.అదేవిధంగా  డాక్టర్ కాలనీ లో నిర్మిస్తున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని , కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా  పర్యటించి  స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలే  పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని,సంతులిత,సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ల సారథ్యంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగు తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎస్ఆర్‌డీపీ కింద వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులు పురోభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఫ్లెఓవర్లు, అండర్‌పాస్లు పూర్తి చేయగా, లింక్‌ రోడ్లను సైతం అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్,ఏఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్,శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ ,  మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,తెరాస నాయకులు పొడుగు రాం బాబు, కృష్ణ యాదవ్, శ్రీనివాస్,శ్రీకాంత్ రెడ్డి, కోటేశ్వరరావు ,అరుణ మరియు గులమోహర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు  గులమోహర్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు ,ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగన్న,అడ్వైజర్లు జయరాజు సింగ్,SK రాజు, ఆర్గనైసింగ్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు,శేఖర్ రావు మెంబెర్లు మాధవరావు,విల్సన్,తారసింగ్ నాయక్,అలీఖాన్,శ్రీనివాస్, నబిరాసుల్, చంద్రశేఖర్, శేషా సాయి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment