
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసీ కమిటీ సమావేశము ఆదివారం దీప్తి శ్రీనగర్ లో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో వడ్డెర జేఏసీ కమిటీ సభ్యులు,వివిధ డివిజన్ల బస్తీల నుండి వడ్డెర నాయకులు పాల్గొని వడ్డెరల సమస్యలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది వడ్డెరలు ఉంటారని అన్నారు. గత ప్రభుత్వాలు వడ్డెరలకు సరియైన న్యాయం చేయలేదని, వడ్డెరలకు రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు వడ్డెరలను గుర్తించాలని, వడ్డెరల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసీ చైర్మన్ పల్లపు యాదయ్య, వైస్ చైర్మన్ ముధంగుల మల్లేష్, కన్వీనర్ ముద్దంగుల తిరుపతి, సలహాదారులు శివరాత్రి యాదయ్య, కో కన్వీనర్స్ కోమ్మరాజుల రవికుమార్, సంపంగి మల్లేష్, వల్లెపు మాధవరావు, కమిటీ సభ్యులు మంజల చందు, ఆలకుంట తిరుపతి, పీట్ల అంబన, ఆలకుంట నరసింహ, మదు, మారుతి, కిషన్, శ్రీను, పల్లన స్వామి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.