
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జ్ డా: మాధవ రెడ్డి అన్నారు.ఆదివారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంచార్జ్ డా. మాధవ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.రాష్ట్ర విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని అన్నారు.చెరువులను కబ్జా కాకుండా చూస్తామని,విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని,అడ్డ కూలీలకు గద్దర్ అన్న ఉచిత ఆహార క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.మధ్యతరగతుల ప్రజలకు కనీస వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు , కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.