
కార్పొరేటర్ రాగం, జలమండలి అధికారులతో కలిసి యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ,బస్తీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు.సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దుబే కాలనీలో రూ.62 లక్షలతో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్,జలమండలి అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.రాబోయే రోజుల్లో మరిన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్,డీజీఎం నారాయణ ,మేనేజర్ యాదయ్య ,శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెరాస నాయకులు చింతకింది రవీందర్ గౌడ్,పద్మారావు, కృష యాదవ్,వేణు గోపాల్ రెడ్డి,నటరాజ్,రమేష్,రమణ,రవీందర్ ,గోపాల్ యాదవ్ ,పోచయ్య,అజమద్,శ్రీ కళ,అరుణ,భాగ్యలక్ష్మి ,రజిని,కుమారి,సుధారాణి, జయ మరియు దుబే కాలనీ వాసులు కాలనీ వాసులు రితేష్ దుబే, మున్యా నాయక్,పిల్లి యాదగిరి, జగదీష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.