
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో, మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశంలో కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపడుతున్నామని శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ,మాదాపూర్ డీవిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో ఇంజినీరింగ్ డి.ఈ స్రవంతి,ఏ.ఈ ప్రశాంత్,జలమండలి డీజీఎం అధికారులు శ్రీమన్నారాయణ,మేనేజర్ ఇల్వర్తి, ప్రభాకర్,ఎలక్ట్రికల్ ఏ.ఈ రామ్మోహన్ లతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతామని విప్ గాంధీ తెలిపారు.మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ,మౌళికవసతులు కల్పనకు పెద్దపీట వేస్తామని,సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనుల్లో నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేస్తామని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా,ప్రజలకు సౌకర్యవంతమైన,మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని,మెరుగైన మంచి నీరు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు,నాయకులు శ్యామ్,ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు మునాఫ్ ఖాన్,కృష్ణ, బస్తీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తి అధ్యక్షులు ముక్తర్,డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం పటేల్,మహిళ అధ్యక్షురాలు బుజమ్మ,మాదాపూర్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు పర్వీన్,మీనాపల్లి ఉమాదేవి,మైనారిటీ నాయకులు ఖాసీం,లియాఖత్ ,బాబూమియా,సలీం, షోయబ్,రెహ్మాన్, నాయకులు రాములు యాదవ్,అంకారావు,బృందరావు,డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా,ఆదిత్య నగర్ యూత్ ఆధ్యక్షులు మహమ్మద్ ఖాజా,బాషరత్ ఖాన్,సయ్యద్ సోయేల్,అక్బర్ ఖాన్,మహమ్మద్,అమీర్ ఖాన్,సద్దాం,మొహిన్,తాజ్ ,ఇమ్రాన్,మహిళలు ఉమాదేవి,రాణి,పద్మ,ఇంజినీరింగ్ వర్క్ ఇంస్పెక్టర్లు వెంకటేష్,సత్యనారాయణ,ఎలక్ట్రికల్ కళీల తదితరులు పాల్గొన్నారు.