
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: నిరుపేదల పక్షపాతి ముఖ్య మంత్రి కేసీఆర్ అని, అందుకే వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నరేన్ గార్డెన్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ ,జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ , పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ తెరాస పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటామని ,కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు, మంత్రి తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని,తెరాస పార్టీయే మనకు శ్రీరామ రక్ష అని తెరాస పార్టీని బ్రతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది అని,పార్టీ బాగుంటే మనం బాగుంటామని అన్నారు.తెరాస పార్టీ ద్విదశాబ్ది వేడుకలను హైటెక్స్ లో అట్టహాసంగా నిర్వహించుకున్నామని అదే స్ఫూర్తితో ,అంతే ఉత్సహంతో నవంబర్ 15న వరంగల్‌లో జరిగే సభను జయప్రదం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారుసీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దళిత బంధు ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని, అది పేదల కోసం అమలువుతున్న పథకం అని అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం అంటే దండుగ అనే పరిస్థితికి తీసుకొస్తే సీఎం కేసీఆర్ వ్యవసాయ అంటే పండగలా మార్చారని అన్నారుసీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేవన్నారు.సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ల సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని గాంధీ పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు ,అశోక్ గౌడ్ , మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్ ,రాజు నాయక్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , గౌతమ్ గౌడ్ , సమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, భాస్కర్, తెరాసనాయకులు మల్లికార్జున శర్మ పురుషోత్తం యాదవ్ ,గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు,వాలా హరీష్ రావు, కర్నాకర్ గౌడ్, మోహన్ ముదిరాజు ,సంజీవ రెడ్డి,దామోదర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జిల్లా గణేష్ గుడ్ల ధనలక్ష్మి,రామ కృష్ణ గౌడ్, మరియు తెరాస నాయకులు ,కార్యకర్తలు . మహిళ నాయకులు , పార్టీ ప్రధాన మరియు అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.