
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జనసేన పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుగా మల్లేష్ ముదిరాజ్ ని పార్టీ నియమించింది. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ మల్లేష్ ముదిరాజ్ కు నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుగా నియమించి బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ , ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం , శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి , నియోజకవర్గ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం అంకితభావంతో పనిచేస్తానని, డివిజన్ లోని ప్రతి ఓటరు వద్దకు, యువత వద్దకు జనసేన పార్టీని చేరుస్తానని అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను ప్రజలకు జనసేన పార్టీ పై నమ్మకం కలిగేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.