Home » *శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలం కోసం TUWJ రాష్ట్ర కమిటీకి వినతి* *హెల్త్ క్యాంప్ లో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులు..*

*శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలం కోసం TUWJ రాష్ట్ర కమిటీకి వినతి* *హెల్త్ క్యాంప్ లో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులు..*

by Admin
1.1kViews

 

శేరిలింగంపల్లి మండల పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భావన స్థలం విషయమై శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీకి వినతి పత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని నల్లగండ్ల పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ లో క్రియా ఫౌండేషన్, టి లైన్24 న్యూస్, కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శేరిలింగంపల్లి జర్నలిస్టులు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, బిఎంఐ, పల్స్ ఆక్సిజన్ లెవెల్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలంపై రాష్ట్ర కమిటీకి వినతి పత్రం సమర్పించారు. శేరిలింగంపల్లిలో పనిచేస్తున్న 52 మంది అర్హులైన జర్నలిస్టులకు 2007లో కుత్బుల్లాపూర్ మండలం బోరంపేట గ్రామ సర్వే నెంబరు 576లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ స్థానికంగా ఉన్న సమస్యల కారణంగా పొజిషన్ తీసుకోలేదని తెలిపారు. గతంలో కేటాయించిన స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్ల స్థలాల కోసం పొజిషన్ ఇప్పించాలని విన్నవించారు. దీంతోపాటు శేరిలింగంపల్లి మండల పరిధిలో ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ భవనం లేదని, మండల పరిధిలోని నల్లగండ్ల సర్వే నెంబరు 82లో ఉన్న 5 గంటల ప్రభుత్వ భూమిని గత 20 ఏళ్లుగా శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ భవనం కోసం కాపాడుతూ వచ్చామన్నారు. ఈ స్థలాన్ని ప్రెస్ క్లబ్ కోసం కేటాయించి, భవన నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ తాజాగా ప్రభుత్వం ఈ స్థలాన్ని వేలం వేసేందుకు స్థల సేకరణ చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై దృష్టి సారించి ప్రెస్ క్లబ్ కోసం సదరు స్థలాన్ని మంజూరు చేసే విధంగా రాష్ట్ర కమిటీ ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి జర్నలిస్టుల సంక్షేమం కోసం తనవంతు సహకారం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్థ హాస్పిటల్ ఎండి డాక్టర్ సిద్దార్థ్ రెడ్డి, కోవిద సహృదయ వ్యవస్థాపకులు డాక్టర్ అనూహ్య రెడ్డి, పవిత్ర స్కూల్ చైర్మన్ వెంకటేష్ లు జర్నలిస్టుల ఆరోగ్యంపై సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, పులి అమృత్ గౌడ్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, టెంజూ శేరిలింగంపల్లి అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషోర్, ప్రెస్ క్లబ్, టెంజూ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు గొడుగు శ్రీనివాస్, మోటూరి నారాయణరావు, ఎల్లేష్, హేమంత్ రెడ్డి, రాజేష్ గౌడ్, లక్ష్మీ నారాయణ, కృష్ణమాచారి, రాజు, విజయ్, షకీల్, ప్రవీణ్, మహేష్ గౌడ్, శంకర్, రామకృష్ణ, బి.కృష్ణ, ప్రణయ్, శ్రీపతి, అరుణ్ కుమార్, ఆనంద్ గౌడ్, దేవేందర్, రామకృష్ణ సాగర్, వరుణ్, రామకృష్ణ, మహేందర్, రామ్ చందర్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి ,శివ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment