
9.4kViews
107
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ తన నామినేషన్ దాఖలు చేశారు.దీంతో శుక్రవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.