
*ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై నానక్‌రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.పురపాలక,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అల, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, డీసీ వెంకన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపూడి గాంధీ మాట్లాడుతూ నల్లగండ్లలో ఎస్టీపీ ప్లాంట్ మంజూరు చేయాలనీ కోరారు. మిషన్ కాకతీయ, చెరువుల సుందరీకరణ పనులపై వివరించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు సమస్య పరిషక్రించాలని,అల్విన్ కాలనీ డివిజన్ లోని ఉషా ముళ్లపూడి కమాన్ రోడ్డు విస్తరణ చేపట్టాలని అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో అపర్ణ నుంచి గంగారం వరకు, శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్‌పూర్ వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యంపై మంత్రికి వివరించారు. మురళీధర్ సొసైటీ రోడ్డు పనులు, నూతనంగా చేపట్టాల్సిన రోడ్లు, లింక్ రోడ్ల ప్రతిపాదనలను తెలిపారు. స్మశాన వాటికల అభివృద్ధిని గురించి ప్రస్తావించారు. నో నెట్వర్క్ ఏరియాల్లో మంచినీటి పైప్ లైన్ పనులను చేపట్టాలన్నారు. ఆస్‌బెస్టస్ కాలనీ సీవరేజ్ సెస్ మాఫీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి, విస్తరణ గురించి చర్చించారు. సానుకూలంగా స్పందించిన తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హమీనిచ్చారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి మంచి నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి స్వచ్చమైన త్రాగు నీరు అందిస్తామన్నారు. నో నెట్ వర్క్ ఏరియా ప్రాంతాల్లో కూడా కొత్తగా మంచి నీటి పైప్ లైన్ నిర్మిస్తామన్నారు. 100 శాతం ప్రతి ఇంటికి నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారినిక రూ.3500 కోట్ల పనులను చేపడతామన్నారు. ప్రతి డివిజనుకు అత్యవసరంగా రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తామన్నారు. రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హమీనిచ్చారు. ఎస్ఎన్‌డీపీ ప్రాజెక్టు కింద నాలాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా 14 చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి డివిజనులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వ్యవస్థ రూపొందిస్తామని ప్రకటించారు. మోడల్ కమ్యూనిటీ హాల్, పార్కుల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ విప్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధూ ఆదర్శ్ రెడ్డి, రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జిహెచ్ఎంసి ఈఎన్‌సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఎస్ఈ ప్రాజెక్ట్స్ వెంకటరమణ, జలమండలి డైరెక్టర్ స్వామి, సీజీఎం విజయ్ రావు, జీఎం రాజశేఖర్, ఎస్ఈ శంకర్ నాయక్, శేరిలింగంపల్లి సీసీపీ నర్సింహ రాములు, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని తదితరులు పాల్గొన్నారు.