Home » శేరిలింగంపల్లిలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి : మునిరత్నం నాయుడు

శేరిలింగంపల్లిలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి : మునిరత్నం నాయుడు

by Admin
8.8kViews
105 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీజేపీ పార్టీ శేరిలింగంపల్లిలో బలంగా ఉందని నియోజకవర్గ ఇంచార్జి కర్ణాటక శాసన సభ్యులు మునిరత్నం నాయుడు అన్నారు. మంగళవారం  మసీద్ బండ పార్టీ  కార్యాలయంలో  శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ బూతు స్థాయి నాయకులు,డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులతో కన్వీనర్ రాఘవేంద్ర రావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా   నియోజకవర్గ ఇంచార్జి కర్ణాటక శాసన సభ్యులు మునిరత్నం నాయుడు,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలనీ అన్నారు.నియోజకవర్గ ప్రజలు బి.ఆర్.ఎస్ ను గద్దె దించడానికి  సిద్దంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో  రవీంద్ర రావు ,గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , నరేష్  గోవర్ధన్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్,నవతా రెడ్డి, సింధు రెడ్డి, స్రవంతి, మహిపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు ,డివిజన్ నాయకులు, బూత్ స్థాయి నాయకులు హాజరయ్యారు.

You may also like

Leave a Comment