
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే గాంధీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.ఈ వేడుకల్లో కార్పోరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,మంజుల రఘునాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన అమరవీరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకు రావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు.ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారని అన్నారు.అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందని ,ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్రమని, ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చే ముందు పేద ప్రజలను గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మాగాంధీ చెప్పారని విప్ గాంధీ తెలిపారు.అదేవిదంగా గచ్చిబౌలి డివిజన్,చందానగర్ డివిజన్,మాదాపూర్ డివిజన్,కొండాపూర్ డివిజన్,శేరిలింగంపల్లి డివిజన్ లలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో ఎమ్మెల్యే గాంధీ మంగళవారం మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ సర్కిల్ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.