
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదర్శనగర్, నెహ్రు నగర్ లలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా శేరిలింగంపల్లి గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గ ప్రజలకు, బిక్షపతి యాదవ్ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్ సంబంధాలు ఉన్నాయని గతంలో చేసిన సేవ ప్రజలు ఇంకా మరువలేదని అంతకంటే ఎక్కువ ఈసారి సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ నుండి బరిలో ఉంటున్నానన్నారు. ప్రజల మద్దతు తనకు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమ్ దాస్, నవతారెడ్డి, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, గుణశేఖర్, చంద్రమౌళి, ఝాన్సీ, అంబు, రమేష్, రాజు మొదలగువారు పాల్గొన్నారు