Home » శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

by Admin
11.2kViews
99 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అధిష్టానం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓల్డ్ హఫీజ్ పేట్, జనప్రియ, లేక్ వ్యూ అపార్ట్ మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ లో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన 6 గ్యారంటీ స్కీమ్ లు వివరించి అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేయాలని కోరారు. అవినీతి కుటుంబ పాలన పోయి అవినీతిలేని తెలంగాణ రావాలంటే రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అధ్యక్షులు జాంగిర్, మాజీ డివిజన్ అధ్యక్షులు రేవెల్ల రాజేష్,వీరేశం గౌడ్, కార్తీక్,యాద గౌడ్, సీనియర్ నాయకులు కాట నరసింహ గౌడ్, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment