Home » శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం : మారబోయిన రఘునాథ్ యాదవ్

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం : మారబోయిన రఘునాథ్ యాదవ్

by Admin
9.5kViews
105 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కొండాపూర్,మేజర్ న్యూస్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మారబోయిన రఘునాథ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ కు మద్దతుగా శేరిలింగంపల్లిలో సోమవారం భారీ కార్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆదిత్య నగర్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం రఘునాథ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్ నిరంకుశ పాలనను తుదముట్టించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేన్ననారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి మహిళలు, వృద్ధుల వరకు అందరి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని హామీ ఇచ్చారు. వితంతువులు, వృద్ధాప్య పింఛన్లను రూ. 4000 వేలకు పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏటా జూన్ 2నే జాబ్ క్యాలెండర్ వేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం యావత్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దుర్మార్గపు బీఆరెస్ పాలనకు అంతం పలికి, కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ఎన్నికలకోసం ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు.

You may also like

Leave a Comment