Home » శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ ఎన్నికల ప్రచారం

శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ ఎన్నికల ప్రచారం

by Admin
9.5kViews
77 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని ఆ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ ధీమా వ్యక్తం చేసారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ముందుగా తార నగర్ లో గల తుల్జా భవాణి అమ్మ వారి దేవాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను,అభివృద్ధి పనుల గురుంచి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించ డంతో పాటు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి భారీ మెజారిటీ సాధించే దిశగా నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిం చాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లోని స్థానికులు బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కొసం ఎకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలను నమ్మించేందుకు అమలు కానీ హామీలను గుప్పిస్తున్నారని, వీరికి ప్రజలు తగు బుద్ది చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment