Home » శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ ల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ ల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే గాంధీ

by Admin
930Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.సోమవారం నియోజకవర్గంలోని గచ్చిబౌలి పరిధిలోని నానక్ రాంగుడా లోని హరిజన బస్తీ,రజక బస్తి,తెనుగు బస్తి పుకెట్ నగర్ కాలనీలలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా,మాదాపూర్ డివిజన్ లో బిక్షపతి నగర్ స్థానిక కార్పొరేటర్ల జగదీశ్వర్ గౌడ్, ఇంజనీరింగ్,జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు.ఈ మేరకు డివిజన్ లలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై,పలు సమస్యలపై అధికారులను,స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నామని,మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు ఎయిర్ టెక్ మిషన్ ద్వారా పూడికను తొలగిస్తున్నామని తెలిపారు. డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద పూడిక తీత తీయాలని , మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే గాంధీ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పద్ద పీట వేస్తానని,కాలనీ వాసులు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను,సమస్యలను పరిగణలోకి తీసుకోని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.సంతులిత,సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఎల్లవేళలా అందుబాటులోఉంటానని,ఏచిన్నసమస్య ఉన్నతనను సంప్రదించాలని స్థానికులకు సూచించారు.మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ఈ కార్యక్రమంలో డీఈ రమేష్,ఏఈ కృష్ణవేణి,ప్రశాంత్ జలమండలి జీఎం రాజశేఖర్,డిజిఎం నారాయణ, మేనేజర్ నివర్తి,స్ట్రీట్ లైట్ డీఈ కిషన్,తెరాస నాయకులు రాగం జంగయ్య యాదవ్, మల్లేష్,రమేష్ గౌడ్, పూరుడి కృష్ణ,విందు,అర్.నారాయణ,అనిల్ సింగ్,బస్తీవాసులు అనిల్ కుమార్,నరేష్,బాలకృష్ణ,చంద్రశేఖర్,మహేందర్,రాజు,గోపాల్,యాదయ్య, సంతోష్,నరసింహ,జంగం గౌడ్ ,మహేష్, తానజీ, చోటమియా,అహ్మద్ బాయ్,గౌస్ ,శ్రీనివాస్,దశరథ్,శ్రవణ్,సంతోష్,బాలరాజు,సత్యనారాయణ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment