Home » శేరిలింగంపల్లిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

by Admin
11.2kViews
68 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అన్ని రంగాలలో మౌలిక వసతులు కల్పిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ.5 .60 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు,వరద నీటి కాల్వల నిర్మాణం అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ బుధవారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకరావాలని సూచించారు.అన్ని వేళలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment