
12.2kViews
143
Shares
తెలంగాణ మిర్రర్, చేవెళ్ల : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో చేపట్టిన శుభోదయం కార్యక్రమం ప్రజాధరణ పొందింది. బుధవారం నాడు ఊరెళ్ల, మొండి వాగు దేవుని, ఎర్రవల్లి గ్రామాలలో గడప గడపకు తిరిగి శుభోదయం కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలిపి సమస్యలను తొందరగా పరిష్కరించాలని తెలిపారు. దేవునిఎర్రవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భావనాన్ని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.