Home » శివాలయాలలో జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు

శివాలయాలలో జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంఏ నగర్ శివాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాస,జాగరణ దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకోవడం జరిగిందని అన్నారు.ఆలయంలో శివలింగానికి జ్ఞానేంద్రప్రాద్ పూజ, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆయా ప్రాంతాల్లోని శివాలయాలను సందర్శించారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీధర్ రావు,కోటేశ్వరరావు,ఆలయ కమిటీ సభ్యులు రవి,విజయ్,నరేంద్ర,రాజు, సభ్యులు,స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment