Home » శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

by Admin
10.1kViews
135 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి శివాలయంలో కార్తీక పౌర్ణమి సంధర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖః సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం శివాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు బస్తీ వాసులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment