
1.2kViews
తెలంగాణ మిర్రర్, మాదాపూర్: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భారత వేదం ఆర్ట్ అకాడమీ, మహేశ్వర మ్యూజిక్ అకాడమీ వారి సంయుక్త నిర్వహణలో “సంగీత నాట్య సమ్మేళనం” కర్ణాటక గాత్రం, కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. సంగీత కచేరి లో జయ జయ గణపతి మంగంబుది, తీరివుడ్జుల, శ్రీ రాజరాజేశ్వరీ, బ్రోచేవారు ఎవడురా, శంకర భరణం వర్ణం, మధుర మీనాక్షి, రామం శ్యామల, రామ భద్ర రారా, ఆడరో పడరో, మాధవ కేశవా మొదలైన కీర్తనలను శ్రీమతి మంజుల, కృతి, నియతి, గాయత్రీ, జ్యోతిర్మయి, స్వాతి మొదలైన వారు గానం చేసారు. డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్ శిష్య బృందం చే కాలభైరవాష్టకం, పార్వతి కళ్యాణం, మహాదేవ శివ శంభో, అయిగిరి నందిని, నమో నమో భారతావని అంశాలను కుమారి రుత్విక, నందిని, చక్రికా, తన్వి శ్రీ, పూజిత, విపాశన, అఖిల మొదలైన వారు ప్రదర్శించారు.