
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్బంగా శిల్పారామం హంపీ థియేటర్ లో గురువారం సంచలన స్కూల్ అఫ్ డాన్స్ గురువు డా.కిరణ్మయి బోనాల శిష్య బృందం ప్రదర్శించిన “నృత్యార్చన” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వినాయక కౌతం, అన్నిమంత్రాలు, అసంయుత హస్తాలు, జతిస్వరం, తారంగం, అమ్మ అన్నంద దాయిని- పడవర్ణం, జనుత శబ్దం,ఒకపరి కొకపరి, సొగసుగా త్యాగరాజ కృతి, మంగళం అంశాలను సంచలన, సమ్మోహన, నయా,జయ, లాహిరి,తనుశ్రీ, యశస్వినీ, కున్దనశ్రీ, అనువింద, రితిక, దిశా, భార్గవి, వరుణ్య, కళాకారులు ప్రదర్శించి కనువిందు చేశారు. వీరికి నట్టువాంగం పై డా.కిరణ్మయి బోనాల, గాత్రం సాయి దీపికా, మృదంగం పై శ్రీధరాచార్య, వయోలిన్ సాయి కోలంక, ఫ్లూట్ ప వెంకటేష్ సహకారం అందించారు. ముఖ్య అతిధులుగా డాక్టర్ పసుమర్తి శేషు బాబు , ప్రొఫెసర్ గౌరీ శంకర్,వైస్సార్ మూర్తి,పద్మ కళ్యాణ్ లు హాజరై కళాకారులకి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.