
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఘనంగా ముగిసాయి. ఈ ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ మేరకు ఆయనకు లింగ శ్రీనివాస్ జానపద బృందం నగర కొమ్ములతో సంప్రదాయంగా బద్దంగా శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సోమేశ్ కుమార్ పలు రాష్ట్ర నుండి వచ్చిన చేనేత హస్త కళాకారులను కలిసి కళా ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలను, చేనేత హస్త కళాకారులను సోమేశ్ కుమార్ సన్మానించారు.సంత్ కబీర్ అవార్డు గ్రహీత నారాయణ్ సామర్థ్, గుజరాత్ శాలువాలు, శిల్పగురు అవార్డు గ్రహీత జహీరుద్దీన్ ఉత్తర్ ప్రదేశ్ టెర్రకోట, నేషనల్ అవార్దీ దాని రామ్ సోని- బ్రాస్ మెటల్, నీలాంబరి ప్రసాద్ చత్తీస్గర్ద్ కొస సారీస్ వారిని సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిల్పారామం పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రతకు, రంగు రంగు పూలని అలంకరించడం ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. చేనేత హస్త కళాకారులకు ప్రభుత్వం చేయూతను అందజేస్తుందని అన్నారు.అనంతరం వైదేహి సుభాష్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనను సీఎస్ సోమేశ్ కుమార్ తిలకించారు.అనంతరం కళాకారులను అభినందించారు.